వైభవంగా శ్రీశైలేశుడి పల్లకోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీశైలేశుడి పల్లకోత్సవం

Jul 6 2026 2:10 AM | Updated on Jul 6 2026 2:10 AM

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల దేవస్ధానంలో ఆదివా రం స్వామి అమ్మవార్లకు పల్లకోత్సవం నిర్వహించారు. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి,మూలా నక్షత్రం రోజులలో (సర్కారి సే వగా) చేపడుతారు. ఇందులో భాగంగా ఆదివా రం ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పం జరిపారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ చేశారు. అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి శాస్త్రోక్తంగా షోడశోపచారపూజలు జరిపారు.

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ఈనెల 6వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap. gov. in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులను స్వీకరించి, పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.

కబడ్డీ సంఘం ఎన్నికలకు నామినేషన్ల ఆహ్వానం

నంద్యాల(న్యూటౌన్‌): నంద్యాల జిల్లా కబడ్డీ సంఘం ఎన్నికలకు క్రీడాకారుల నుంచి నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంఘం కార్యదర్శి సుబ్రమణ్యం, అధ్యక్షుడు మోహన్‌రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ క్రీడా పరిపాలన చట్టం– 2025 ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యలు, కమిటీలను ఏర్పాటు చేయా లని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఇందులో భాగంగా జిల్లా కబడ్డీ సంఘాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నామినేషన్‌ వేయాలనుకున్న క్రీడాకారులు సర్టిఫికెట్లు, సహాయ పత్రాలతో ఈనెల 20లోగా కబడ్డీ జిల్లా సంఘం కార్యదర్శికి సమర్పించాలన్నారు.

తీవ్ర గాలులు..

నేలతో తేమ ఆవిరి

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి జిల్లాలో పశ్చి మం దిశగా గాలులు గంటకు 25 నుంచి 30 కిలో మీటర్ల వేగంలో వీస్తున్నాయి. పొలాల్లో విత్తనాలు వేయగా వచ్చిన మొలకలు గాలుల తీవ్రతకు లేచిపోతున్నాయి.గాలుల ప్రభావంతో నేలలోని తేమ వేగంగా ఆవిరైపోతోంది. దీంతో పత్తి, వేరుశనగ, ఆముదం, మొక్కజొ న్న, సజ్జ తదితర పంటలు దెబ్బతింటున్నాయి. గాలుల ప్రభావం ఈ ఏడాది పెరగడానికి ఎల్‌నినో ప్రభావమేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు 4.35 లక్షల హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 2 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు. దాదాపు 25 రోజులుగా అక్కడక్కడ జల్లులు మినహా వర్షాలు లేవు. దీంతో మొక్కలు ఎండిపోతున్నాయి. పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు విత్తనం పనులు కూడా నిలిచిపోయాయి.

అలరించిన నృత్య ప్రదర్శన

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆలయ దక్షిణ మాడ వీధుల్లోని నిత్య కళా వేదికపై హైదరాబాద్‌ కు చెందిన శ్రీహరి ఆర్ట్స్‌ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో భో..శంభో, వినాయకకౌత్వం, అయిగిరినందిని, కాలభైరవాష్టకం, శివతాండవం, శివస్తుతి తదితర గీతాలకు విజయమాధవి, అభిన్య, సింధుజ, మేఘన, తేజస్విని, నిత్య శ్రీలక్ష్మి, వైదసంహిత, భవిష్య, నందిని, నిత్యశ్రీ తదితరులు ప్రదర్శించిన నృత్యం భక్తులను ఆకట్టుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement