బల్లలున్నా.. కిందనే చదువులు! | - | Sakshi
Sakshi News home page

బల్లలున్నా.. కిందనే చదువులు!

Jul 8 2026 1:26 AM | Updated on Jul 8 2026 1:26 AM

హత్యకేసు నిందితుల అరెస్ట్‌

రుద్రవరం: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా బల్లలున్నా వారి చదువులు నేలపైనే కొనసాగుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మన బడి నాడు–నేడు పేరుతో పాఠశాలల రూపు రేఖలు మార్చారు. విద్యార్థులకు అవసరమైన వసతులన్నీ కల్పించారు. అయితే ఆ వసతులను కూడా సరిగా వినియోగించుకోలేక పోతుండటం గమనార్హం. మండల పరిధిలోని కే.కొత్తూరులో ప్రైమరీ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 36 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి విద్యాబోధన చేసేందుకు హెచ్‌ఎం, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. హెచ్‌ఎం వెంకటరెడ్డి వరండాలో అటు ఇటు తిరుగుతుండగా ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ ఒకే గదిలో కొందరిని బల్లలపై, కొందరిని కింద కూర్చోబెట్టి చదువు చెబుతున్నారు. దీంతో మిగిలిన గదుల్లో బల్లలు ఖాళీగా ఉంటున్నాయి. మరో గదిలో ఫ్యాన్‌ కింద బల్లపై పడుకొని ఏజెన్సీ నిర్వాహకురాలు సేదదీరుతోంది. అయినా హెచ్‌ఎం నిమ్మకుండిపోయారు. అలాగే ఢీ.కొట్టాల పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు గాను ఒక్కరే విధుల్లో ఉండటంతో విద్యార్థులను బండలపై కూర్చోబెట్టారు. రెండు పాఠశాలల్లోనూ మెనూ ప్రకారం రాగి జావా ఇవ్వలేదు. ఇదేమని అడగ్గా పొడి అయిపోయిందని చెబుతున్నారు. ఈ విషయంపై ఎంఈఓ లక్ష్మిని అడగ్గా.. విచారించి ఆయా పాఠశాలల ఉపాధ్యాయులను మందలించి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కర్నూలు: కల్లూరు ఎస్టేట్‌ చింతలముని నగర్‌కు చెందిన కొండపల్లి శ్రీనివాసులు హత్య కేసులో మౌలాలి, యువరాజ్‌ అలియాస్‌ అభి అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు నాల్గవ పట్టణ సీఐ విక్రమసింహా తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత మే 13 నుంచి శ్రీనివాసులు అదృశ్యమయ్యాడని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. కాల్‌ డేటా ఆధారంగా విచారించగా శ్రీనివాసులు అదే ప్రాంతంలో మేసీ్త్ర పని చేసే మౌలాలి గతంలో స్నేహితులని తెలిసిందన్నారు. మౌలాలి కొంత డబ్బును శ్రీనివాసులుకు అప్పుగా ఇచ్చాడని, డబ్బు తిరిగివ్వమని అడిగిన సందర్భంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయన్నారు. ఈ విషయంలో శ్రీనివాసులు తన స్నేహితులతో కలిసి రెండు సార్లు మౌలాలిని కొట్టాడన్నారు. దీన్ని మనసులో పెట్టుకున్న మౌలాలి తనతో పాటు సెంట్రింగ్‌ పనిచేసే అదే ప్రాంతానికి చెందిన యువరాజ్‌ అలియాస్‌ అభి సహాయంతో మే నెల 13న శ్రీనివాసులుకు ఫోన్‌ చేసి చెన్నమ్మ సర్కిల్‌లో మద్యం కొనుగోలు చేసి కల్లూరు ఎస్టేట్‌లోని శ్రీగోడ ఆంజనేయస్వామి ఆలయం శివారులో మద్యం సేవించారు. ఈ సమయంలో మాటామాటా పెరగడంతో మౌలాలి, అభి కలిసి బండరాయితో శ్రీనివాసులు తలపై మోది అక్కడి నుంచి పారిపోయారు. విచారణ జరిపి నిందితులిద్దరినీ ఈనెల 6న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement