సీఎం చంద్రబాబు నాయుడు 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో శ్రీశైలం నీటిముంపు నిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తానని పటేల్ సెంటర్‌లో వేలాది జనం మధ్యలో ఇచ్చిన హామీని విస్మరించడంతో బాధితులు మూడు నెలలుగా నందికొట్కూరు పట్టణంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. శుక్రవారానికి 100 రోజుకు చేరుకుంది. అయినా అధికారులు కానీ.. కూటమి నేతలు అటు వైపు కన్నెత్తి చూడలేదు. నిర్వాసితులు ఆమరణ దీక్షకు కూడా సిద్ధం అంటున్నారు. నిర్వాసితులకు న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.


