శ్రీశైలం: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని, ఆటపాటలతో విద్య బోధించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి చైర్మన్ సూర్యనారాయణ రాజు సూచించారు. సోమవారం మధ్యాహ్నం శ్రీశైలం చేరుకున్న ఆయనకు డీసీపీఓ స్వప్న ప్రియదర్శిని, నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరమ్మ, మండల ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అంజలిదేవిలు భ్రమరాంబ అతిథి గృహంలో ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన సున్నిపెంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాల)ను పరిశీలించారు. అక్కడినుంచి సున్నిపెంటలోని ప్రతిభ గురుకుల పాఠశాల, బీసీ హాస్టల్‌ను పరిశీలించి సమస్యలపై ఆరా తీశారు. శ్రీశైలంలోని మేకలబండలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట మహిళా శిశు సంక్షేమ శాఖ సభ్యులు మధుసూదన్ రావు, వన్‌టౌన్ సీఐ జీవన్ గంగనాథ్ బాబు తదితరులు ఉన్నారు.


