బండిఆత్మకూరు: మొరసు మాఫియా కుందూనదిని కొల్లగొడుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే పట్టపగలు యంత్రాలతో తవ్వేస్తోంది. అడ్డుకోవాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. మండల పరిధిలోని భోజనం గ్రామ వంతెన సమీపంలో గురువారం జేసీబీతో భారీ ఎత్తున మొరసు తవ్వి ట్రాక్టర్ల ద్వారా రామాపురం వైపు తరలించారు. రోజూ బహిరంగంగానే ఈ తంతు సాగుతున్నప్పటికీ రెవెన్యూ, మైనింగ్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. మొరసు అక్రమ తరలింపును అడ్డుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు.


