ఏపీ ఈఏపీసెట్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఏపీ ఈఏపీసెట్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

Jul 2 2026 12:47 PM | Updated on Jul 2 2026 12:47 PM

నంద్యాల(న్యూటౌన్‌): ఏపీ ఈఏపీసెట్‌లో నంద్యాల జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో అగ్రికల్చర్‌ ఫార్మసీ విభాగంలో నంద్యాల పట్టణానికి చెందిన పి.అక్షిత 86.52 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ ర్యాంకు, స్టేట్‌లో 33వ ర్యాంకు సాధించారు. ఇంజినీరింగ్‌ ఫార్మసీ విభాగంలో నంద్యాలకు చెందిన జి.జయవర్ధన్‌రెడ్డి 86.03 మార్కులతో జిల్లాలో ప్రథమ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 54వ ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్‌ విభాగంలో జిల్లాకు చెందిన నరాల హర్ష అశ్వని రాష్ట్రస్థాయిలో 82వ ర్యాంకు, యశోద హారిక చైత్ర 116వ ర్యాంకు, భువనేశ్వర్‌ 151వ ర్యాంకు, సుబ్బతేజ మనోజ్ఞ 173వ ర్యాంకు, ప్రకాష్‌రెడ్డి 177వ ర్యాంకు, సుజితారెడ్డి 263వ ర్యాంకు, నాగ విష్ణుప్రియ 335వ ర్యాంకు, బి.నమర్థ్‌ 343, హర్షితయాదవ్‌ 435 ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్‌ ఫార్మసీలో రుత్విక 59, తేజసాయి 197, శ్రీవర్ధన్‌రెడ్డి 213, విద్యశ్రీ 228, సాల్మన్‌వెస్లీ 377, జగదీశ్వర్‌ 399, నాగ విఘ్నేష్‌ 414, సాయి షశాంత్‌ 506, శివచక్రదర్‌ 588 ర్యాంకులు సాధించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement