ప్రధానంగా జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల్లో రేబిస్ అత్యంత ప్రమాదకరమైంది. కుక్కల నుంచి ఈ వ్యాధి సోకుతుంది. నేడు జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కుక్కలకు సోమవారం జిల్లా వ్యాప్తంగా యాంటి రేబిస్ టీకాలు వేసే కార్యక్రమం చేపట్టాం. బహుళార్ధ పశువైద్యశాలతో పాటు ఏరియా హాస్పిటల్స్, వెటర్నరీ డిస్పెన్షరీలలో కుక్కలకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా వేస్తాం. ఈ అవకాశాన్ని కుక్కలు పెంచే వారు వినియోగించుకోవాలి.
– డాక్టర్ రాజశేఖర్, జాయింట్ డైరెక్టర్. జిల్లా పశుసంవర్ధకశాఖ, కర్నూలు


