శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం న్యాయమూర్తి మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆలయం ఆశీర్వచన మండపంలో న్యాయమూర్తికి వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన ఈఓ స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందజేశారు.
– శ్రీశైలం టెంపుల్


