వ్యవసాయంలో యాంత్రీకరణలో భాగంగా రైతాంగం పొలం పనులను సులభంగా, వేగంగా పూర్తి చేసుకుంటున్నారు. మండల కేంద్రం సి.బెళగల్‌కు చెందిన తెలుగు వీరేష్ పొలంలో మంగళవారం కూలీలు ట్రాక్టర్ ద్వారా పత్తి పంటలో దెంతలు పట్టారు. కాడెద్దులతో ఐదు ఎకరాలలో దెంత పట్టేందుకు రోజంతా సమయం పడుతుండగా, ట్రాక్టర్ ద్వారా మధ్యాహ్నానికి పూర్తవుతుందని, పైగా మొక్కలను ఎద్దులు తొక్కడంతో నలిగేవని, వ్యవసాయ ట్రాక్టర్‌తో అలాంటి సమస్యలు లేవని రైతులు అంటున్నారు. గతంలో వ్యక్తులను అనుసరించడంలో గొర్రు వెంట గుంటిక అనే నానుడి గ్రామాల్లో ప్రాచూర్యంలో ఉంది. అయితే ఇప్పుడు అలా కాకుండ ట్రాక్టర్ వెంట దెంతలుగా మారనుందా అని పల్లె జనం చమత్కారించుకుంటున్నారు. – సి.బెళగల్


