గోనెగండ్ల: గోనెగండ్లలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు గురువారం రాత్రి భోజ నం అనంతరం కుళ్లిన అరటి పండ్లను పంపిణీ చేశారు. అవి కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో విద్యార్థిను లు తినకుండా పాఠశాల బయట డబ్బాలో పడేశారు. అయితే మొహర్రం సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రు లు గురువారం పాఠశాలకు వెళ్లడం, అక్కడ డబ్బాల లో కుళ్లిన అరటి పండ్లను చూసి జరిగిన విషయం తెలుసుకున్నారు. వీటిని కొందరు ఫొటోలు, వీడియో లు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం వైరల్ అవుతోంది.గోనెగండ్ల కేజీబీవీ పాఠశాలలో విద్యార్థి నులకు మెనూ ప్రకారం భోజనం కూడా అందించడం లేదని తెలుస్తోంది. ఈ విషయమై కేజీబీవీ ప్రిన్సిపాల్ విద్యావతిని ప్రశ్నించగా బుధవారం రాత్రి మంచి అర టి పండ్లనే ఇచ్చామన్నారు. అరటి తొక్కలను సమీపంలోని బర్రెల పెంపకందారులు తీసుకెళ్తుండటంతో బ యటి డబ్బాలో పడేస్తామన్నారు. వీటిని బాలికల తల్లిదండ్రులు సోషల్ మీడియాలో వైరల్ చేశారన్నారు.


