సబ్‌ జైలు ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

సబ్‌ జైలు ఆకస్మిక తనిఖీ

Jul 1 2026 5:08 AM | Updated on Jul 1 2026 5:08 AM

నంద్యాల(వ్యవసాయం): పట్టణంలోని సబ్‌ జైల్‌ను మూడవ అదనపు జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి, మండల లీగల్‌ సెల్‌ చైర్మన్‌ అమ్మన్నరాజ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులోని పరిసరాలను, వంట, స్నానపు గదులను పరిశీలించి, అధికారులకు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి ఖైదీలను ఉద్దేశించి మాట్లాడుతూ పేద, వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని అన్నారు. అదేవిధంగా ఖైదీల హాజరు పట్టిని పరిశీలించి వారి ఆరోగ్యం, కేసులు వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు న్యాయ సహాయం కోసం 15100కు సమాచారాన్ని అందజేయాలని, ఉచితంగా న్యాయవాది కోర్టులో వాదిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ గురుప్రసాదరెడ్డి, లోక్‌అదాలత్‌ సిబ్బంది రామచంద్రారెడ్డి, న్యాయ వాది బాలు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

నంద్యాల(న్యూటౌన్‌): 2026 ఏడాదికి జాతీయ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ జనార్ధన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్‌, మండల ప్రజా పరిషత్‌, ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయా లు, జవహర్‌ నవోదయ విద్యాలయాలు, అటామిక్‌ ఎనర్జీ విద్యాలయాలు, సైనిక్‌ పాఠశాలలు, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండి, సివిల్‌, క్రిమినల్‌ కేసులు, ఆరోపణలు, క్రమశిక్షణ చర్యలు లేని ఉపాధ్యాయులు అనర్హులన్నారు. జూలై 15లోగా https:// national awardstoteachers. education.gov.in/ nominations వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement