వెండి నాగాభరణం సమర్పణ | - | Sakshi
Sakshi News home page

వెండి నాగాభరణం సమర్పణ

Jul 1 2026 5:08 AM | Updated on Jul 1 2026 5:08 AM

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానానికి రంగారెడ్జి జిల్లా నాదర్గుల్‌కు చెందిన పి.రవీందర్‌ కుటుంబ సభ్యులు 416 గ్రాముల ఐదు శిరస్సులతో కూడి న వెండి నాగాభరణాన్ని, వెండి చెంబును విరాళంగా సమర్పించారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వెండి వస్తువులను అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంజి రవికి అందజేశారు. దాతలకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు అందజేసి సత్కరించారు.

మూడేళ్లకే నూరేళ్లు !

డ్రైనేజీ కాల్వలో పడి బాలుడి మృతి

జూపాడుబంగ్లా: బుడి బుడి అడుగులు వేస్తూ.. బోసి నవ్వులు నవ్వుతూ అప్పటి వరకు తల్లిదండ్రులను ఆనంద పరిచిన కుమారుడు అంతలోనే దూరమయ్యాడు. ప్రమాదవశాత్తూ ఇంటి వద్ద ఉన్న డ్రైనేజీ కాల్వలో పడి మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఖలీల్‌, ఉమామహేశ్వరి దంపతులు మంగళవారం రాత్రి ఇంటి పనుల్లో నిమగ్నమయై ఉండగా.. పెద్ద కుమారుడు కిఫాయత్‌ (03) ఇంటి వద్ద ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తు డ్రైనేజీ కాల్వలో పడిపోయాడు. కొద్ది సేపటి తర్వాత కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై చుట్టుపక్కల ఇళ్లల్లో గాలించారు. ఆచూకీ లేకపోవడంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టగా ఇంటివద్ద ఉన్న డ్రైనేజీ కాల్వలో బాలుడి పడినట్లు గుర్తించారు. వెంటనే బాలుడిని వెలికి తీసి 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేస్తుండగానే బాలుడు మృతి చెందాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement