మల్లన్న హుండీ ఆదాయం రూ.5.45 కోట్లు | - | Sakshi
Sakshi News home page

మల్లన్న హుండీ ఆదాయం రూ.5.45 కోట్లు

Jun 23 2026 1:52 AM | Updated on Jun 23 2026 1:52 AM

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కి ంచగా నగదు రూపేణా రూ.5,45,55, 035 లభించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం దేవస్థానం అలంకార మండపంలో హుండీల లెక్కింపు చేపట్టారు. గత 27 రోజులలో భక్తులు ఈ కానుకలను సమర్పించారు. అలాగే బంగారం 127 గ్రాముల 500 మిల్లీగ్రాములు, వెండి–3కేజీల 680 గ్రాములతో పాటు కొంత విదేశీ కరెన్సీ వచ్చిందన్నారు. అలాగే 93రోజుల్లో అన్నదాన భవనంలోని అన్నప్రసాద వితరణ హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.8,80,396 లభించిందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement