● ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్
నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో జూలై నెలలో ఉద్యమం చేస్తామని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) జిల్లా అధ్యక్షుడు ఎస్. చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు.చంద్రశేఖర్, అజాంబేగ్ మాట్లాడుతూ.. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23ను రాష్ట్ర ప్రభుత్వం సవరించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలన్నారు. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలం పూర్తి అయినప్పటికీ ఉద్యోగులకు రావాల్సిన అరియర్స్ గురించి, సరెండర్ లీవ్ గురించి స్పందించడం లేదన్నారు. నాయకులు నాగేంద్ర కుమార్, మౌలాలి, జీవీ రమణ, నూరుల్లా, అమీర్, సుబ్బారాయుడు, శ్రీనివాసులు, నరసింహారావు సుధాకర్, షరీఫ్ పాల్గొన్నారు.


