వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం | - | Sakshi
Sakshi News home page

వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం

Jun 25 2026 12:54 AM | Updated on Jun 25 2026 12:54 AM

నంద్యాల(వ్యవసాయం): వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఉమ్మడి జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి లీలా వెంకటేష్‌ శేషాద్రి తెలిపారు. న్నారు. నంద్యాల సబ్‌జైల్‌ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలు పరిసరాలను, స్నానపు గదులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఖైదీల ఆరోగ్య విషయాలు, వారి నేర ప్రవృత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సుపైన అవగాహన కల్పించారు. ఖైదీలకు ఏదైనా అవసరం ఉంటే 15100కు సమాచారాన్ని ఇవ్వవలసిందిగా ఆయన కోరారు. జైలు సూపరిండెంటెంట్‌ గురుప్రసాద్‌రెడ్డి, లోకదాలత్‌ సిబ్బంది రామచంద్రారెడ్డి, న్యాయవాది బాలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో

విద్యార్థుల సంఖ్యను పెంచాలి

మహానంది: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ జనార్ధన్‌ రెడ్డి అన్నారు. గోపవరంలోని మండల పరిషత్‌ ప్రాధమిక, జిల్లా పరిషత్‌ పాఠశాలలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానోపాధ్యాయులు, ఉపా ధ్యాయులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్య, వసతులపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ఎంఈఓలు రామసుబ్బయ్య, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

పదవీ కాలం పొడిగింపు

కర్నూలు(అగ్రికల్చర్‌): నంద్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వరకు ఉన్న పాలకవర్గంలో ఒకరిని మార్పు చేసింది. ఇప్పటి వరకు ఉన్న పాలకవర్గంలో సభ్యుడిగా ఉన్న చింతల నాగకుమార్‌ స్థానంలో తోట రామభూపాల్‌ నియమితులయ్యారు. పాలకవర్గంలో మిగిలిన వారందరూ యథతథంగా కొనసాగుతారు.

కేఎంసీకి 250 ఎంబీబీఎస్‌ సీట్లు రెన్యూవల్‌

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు మెడికల్‌ కాలేజీలోని 250 ఎంబీబీఎస్‌ సీట్లను నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ రెన్యూవల్‌(పునరుద్ధరణ) చేసింది. 45 రోజుల్లోగా కళాశాలలో మౌలిక సదుపాయాలు, వైద్యపరమైన లోపాలను సరిదిద్దుకోవాలని షర తు విధించింది. ఎన్‌ఎంసీ పరిశీలనలో కళాశాలలో కనీస ప్రమాణాల ప్రకారం కొన్ని లోపాల ను గుర్తించారు. అయినప్పటికీ 2026–27 విద్యాసంవత్సరం కోసం అధ్యాపకుల లభ్యత, భౌతిక సౌకర్యాలను సరిదిద్దడంలో విఫలమైతే సీట్ల తగ్గింపు లేదా ప్రవేశాల నిలిపివేత సహా శిక్షణాత్మక చర్యలు తీసుకోవాల్సి రావచ్చని సూచించింది. అయితే తాము కళాశాలకు సంబంధించి అన్ని వివరాలను ఎన్‌ఎంసీకి పంపించామని, వారు కేవలం ఆఖరి పేజీని చూసి లోపాలు ఉన్నట్లు పొ రపాటు పడ్డారని, ఈ మేరకు తిరిగి వివరాలను ఆధారాలతో సహా పంపిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement