ఏసీబీ డీఎస్పీకి పదోన్నతి | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ డీఎస్పీకి పదోన్నతి

Jul 5 2026 7:14 AM | Updated on Jul 5 2026 7:14 AM

సదరన్‌ రీజియన్‌ హోంగార్డ్‌ కమాండెంట్‌గా హనుమంతు

కర్నూలు: కర్నూలు రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ దివిటి సోమన్నకు అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది డీఎస్పీలకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో భాగంగా కర్నూలు ఎసీబీ డీఎస్పీగా పనిచేస్తున్న సోమన్నకు కూడా పదోన్నతి కల్పించి పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ అమరావతిలో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కుమార్‌ విశ్వజిత్‌ శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం వేపకుంట గ్రామానికి చెందిన సోమన్న 1991లో ఎస్‌ఐ హోదాలో పోలీసు శాఖలో చేరి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లలో ఎస్‌ఐగా, సీఐగా పనిచేశారు. 2020లో డీఎస్పీగా పదోన్నతి పొంది సీఐడీ, ఆదోని డీఎస్పీగా పనిచేశారు. 2025 ఏప్రిల్‌ 30న ఏసీబీ డీఎస్పీగా నియమితులై సుమారు 14 నెలల పాటు సేవలందించారు.

కర్నూలు: సదరన్‌ రీజియన్‌ కర్నూలు హోంగార్డ్‌ కమాండెంట్‌గా అమిటి హనుమంతు నియమితులయ్యారు. రాష్ట్రంలో ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు, ఒక హోంగార్డు కమాండెంట్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కర్నూలు సదరన్‌ రీజియన్‌ హోంగార్డు కమాండెంట్‌గా ఉన్న మేకల మహేష్‌ కుమార్‌ను తిరుపతిలోని పోలీస్‌ శిక్షణ కేంద్రం(పీటీసీ)కు బదిలీ చేసి.. గుంటూరు ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న హనుమంతును కర్నూలు హోంగార్డ్స్‌ విభాగానికి బదిలీపై వస్తున్నారు.

సోమన్న

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement