నానాజీ.. నాలుక చీరేస్తాం! | - | Sakshi
Sakshi News home page

నానాజీ.. నాలుక చీరేస్తాం!

Jun 28 2026 7:12 AM | Updated on Jun 28 2026 7:12 AM

స్థాయి తెలుసుకొని మాట్లాడు

ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా

నంద్యాల(అర్బన్‌): స్థాయి తెలుసుకుని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడితే బాగుంటుందని, లేదంటే నాలుక చీరేస్తామని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా హెచ్చరించారు. పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు శనివారం టూటౌన్‌ ఎస్‌ఐ కృష్ణారెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రాజకీయాల్లో విమర్శలు సహజమని, విజ్ఞత మరిచి మాట్లాడితే సహించేది లేదన్నారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల అనుభవం, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఓ పార్టీ నాయకుడిగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పంతం నానాజీ నోరు పారేసుకోవడం దారుణమన్నారు. ఇలాంటి దుర్మార్గమైన మాటలు పలికే వారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్‌ సెక్రటరీ శశికళారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర స్పాక్‌ పర్సన్‌ రవికుమార్‌, స్టేట్‌ ఎస్టీసెల్‌ సెక్రటరీ ఆంజనేయులు, కార్యదర్శి శంకర్‌నాయక్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా లీగల్‌సెల్‌ అధ్యక్షుడు రామసుబ్బయ్య, ఉపాధ్యక్షుడు దాల్‌మిల్‌ అమీర్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గంగిశెట్టి శ్రీధర్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్‌ ఆజాద్‌, అధికార ప్రతినిధి అనిల్‌ అమృతరాజ్‌, మున్సిపల్‌ వింగ్‌ అధ్యక్షుడు టైలర్‌ శివ, జిల్లా సెక్రటరీ దేవనగర్‌ బాషా, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు రమణ, అసెంబ్లీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, అసెంబ్లీ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు రామచంద్రుడు, నాయకులు సాయిరాంరెడ్డి, మాజీ కౌన్సిలర్లు చింతా శ్రీనివాసులు, మేస చంద్రశేఖర్‌, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement