రాజకీయ కుట్రతోనే అరెస్ట్‌ చేశారు | - | Sakshi
Sakshi News home page

రాజకీయ కుట్రతోనే అరెస్ట్‌ చేశారు

Jul 5 2026 7:14 AM | Updated on Jul 5 2026 7:14 AM

కొలిమిగుండ్ల(అవుకు): రాజకీయంగా ఎదుగుతున్నాడనే ఓర్వలేకనే కుట్రతో అక్రమంగా అరెస్ట్‌ చేశారని అవుకు పట్టణానికి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పబ్లిసిటీవింగ్‌ సెక్రటరీ కునుకుంట్ల రామన్న కుటుంబ సభ్యులు ఆరోపించారు. రామన్నపై పీడీ యాక్ట్‌ అమలు చేసి కడప సెంట్రల్‌ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. శనివారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అవుకు మండల కన్వీనర్‌ కాటసాని తిరుపాల్‌రెడ్డితో కలసి అవుకు చేరుకొని రామన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలీసులు వ్యవహరించిన తీరుతో పాటు అరెస్ట్‌కు గల కారణాలను కాటసానికి రామన్న కుటుంబ సభ్యులు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాతకేసులను తెరపైకి తీసుకొచ్చి ఉద్దేశ పూర్వకంగానే అరెస్ట్‌ చేశారని తెలిపారు. తెల్లవారు జామునే అందరూ నిద్రించే సమయంలో పెద్ద ఎత్తున పోలీసులు ఇంట్లోకి చొరబడి తీసుకెళ్లారని చెప్పారు. ఏం నేరం చేశాడని పదుల సంఖ్యలో పోలీసులొచ్చి తీసుకెళ్లారని ప్రశ్నించారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామని వారికి కాటసాని భరోసా ఇచ్చారు. అక్రమ అరెస్ట్‌లపై వైఎస్సార్‌సీపీ తరఫున న్యాయ పోరాటం చేస్తామన్నారు. కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement