ఎమ్మిగనూరురూరల్: నవోదయ కోచింగ్ సెంటర్లో ఉండటం ఇష్టం లేక నిశాంత్ అనే విద్యార్థి మూడో అంతస్తు నుంచి కింద దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఆదివారం ఎమ్మిగనూరు పట్టణంలో కలక లం లేపింది. కోడుమూరు మండలం మాచాపురం గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి తన కుమారుడి నిశాంత్(12)ను పట్టణంలోని గుడేకల్ రోడ్డులో ఉండే గురు నవోదయ కోచింగ్ సెంటర్లో ఐదు రోజుల క్రితం వదలివెళ్లాడు. ఆదివారం కుమారుడిని చూడటానికి తండ్రి వచ్చాడు. తనకు ఇక్కడ ఉండలేనని కుమారుడు చెప్పడంతో తండ్రి మందలించి వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన నిశాంత్ కోచింగ్ సెంటర్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకడంతో మోటార్‌బైక్‌ీసీటుపై పడ్డాడు.అక్కడ ఉన్న విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే కింద పడిన విద్యార్థి నిశాంత్‌ను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కిందకు దూకినప్పుడు మో టర్ బైక్ సీటుపై పడటంతో ఊపిరితిత్తుల భాగంలో ఒత్తిడికి గురైనట్లు వైద్యులు చెప్పారు. నిశాంత్ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మూడో అంత స్తు నుంచి కింద దూకినప్పుడు రోడ్డుపై పడింటే విద్యార్థి ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేదని ప్ర త్యక్ష సాక్షలు చెప్పారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు సాయంత్రం తెలిపారు.


