మహానేతకు చిత్రాంజలి | - | Sakshi
Sakshi News home page

మహానేతకు చిత్రాంజలి

Jul 8 2026 1:26 AM | Updated on Jul 8 2026 1:26 AM

నంద్యాల(అర్బన్‌): దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి పురస్కరించుకొని పట్టణానికి చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్‌ 8 పొట్రెయిట్‌ చిత్రాలను గీశారు. ప్రజలు వైఎస్సార్‌ను స్మరించుకుంటున్నట్లు చిత్రంలో చూపించారు. బాల్యంలో, ఎన్‌సీసీ విద్యార్థిగా, వైద్య విద్యార్థిగా, డాక్టర్‌గా, రాజకీయ ప్రవేశం, రాజసమైన చిరునవ్వు, ప్రజలకు నమస్కారం చేస్తున్న చిత్రాలను కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అనేక సంక్షేమ పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రుణమాఫీ, ఉచిత విద్యుత్‌ ఇలా అనేక సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కోటేష్‌ కొనియాడారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement