హొళగుంద: ఇంగళదహాళ్ బీసీ హాస్టల్‌లో 8వ తరగతి చదువుతూ శనివారం సాయంత్రం అదృశ్యమైన హొళగుందకు చెందిన హరివాణం గోవర్ధన్‌ను హొళగుంద పోలీసులు ఆదివారం తల్లిదండ్రలుకు అప్పగించారు. ఈ విద్యార్థి శనివారం సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత స్నేహితులతో కలిసి బయటకెళ్లి వస్తానని హాస్టల్ సిబ్బందికి చెప్పి రాత్రయినా తిరిగి రాలేదు. వార్డన్, వాచ్‌మన్ హొళగుంద పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ దిలీప్‌కుమార్ ఆదేశాల మేరకు సిబ్బంది రాత్రంతా గాలించారు. అలాగే విషయాన్ని సోషియల్ మీడియాలో వైరల్ చేసి విద్యార్థి ఆచూకీని కనుగొన్నారు. పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్ర సిరుగుప్ప నియోజకవర్గం కె.బెళగల్‌లో ఉన్నాడని తెలుసుకుని అక్కడి నుంచి విద్యార్థి గోవర్ధన్‌ను హొళగుందకు తీసుకొచ్చి తల్లిదండ్రలుకు అప్పగించారు.


