చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థులకు అందించిన స్కూల్ బ్యాగ్‌లలో డొల్లతనం విద్యార్థులకు శాపంగా మారింది. బ్యాగ్‌లు ఎక్కడికక్కడ చిరిగి పీలికలు కాగా విద్యార్థులు వాటితోనే అవస్థలు పడుతూ సి.బెళగల్ జెడ్పీ హైస్కూల్‌కు వెళుతూ కనిపించారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమై 18 రోజులు గడిచినా విద్యార్థి మిత్ర కిట్లను ప్రభుత్వం అందించకపోవడంతో విద్యార్థులు పాత బ్యాగులతోనే స్కూళ్లకు వెళుతున్నారు. కొందరు విద్యార్థులు రెండేళ్ల కిందట వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన బ్యాగులను వినియోగిస్తుండటం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన బ్యాగ్‌లు పూర్తిగా చిరిగిపోగా, విద్యార్థుల గురించి ఆలోచించి వారికి మామయ్యగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్ల క్రితం అందించిన బ్యాగ్‌లు నేటికీ పటిష్టంగా ఉండటం ప్రజలను ఆలోచింపజేస్తోంది. నాణ్యత గురించి డప్పాలు చెప్పుకునే టీడీపీ నేతల పాలనలో డొల్లతనాన్ని బ్యాగులను చూస్తేనే బయటపెడుతోందని స్థానికులు అంటున్నారు. చిరిగిన బ్యాగులలో పుస్తకాలను పాఠశాలకు తీసుకెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. – సి.బెళగల్


