పాఠశాల స్థలం కబ్జాపై నిరసన గళం | - | Sakshi
Sakshi News home page

పాఠశాల స్థలం కబ్జాపై నిరసన గళం

Jul 7 2026 1:19 AM | Updated on Jul 7 2026 1:19 AM

కబ్బాకు పాల్పడిన టీడీపీ నేత విద్యా శాఖ మంత్రి లోకేశ్‌

ఆదోని: మండలంలోని దొడ్డనగేరి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 11.38 సెంట్ల స్థలాన్ని తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు కురువ శివప్ప కబ్జా చేసిన నేపథ్యంలో సోమవారం ఉదయం విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిసి పాఠశాలను మూసివేసి నిరసన తెలిపారు. తమ పాఠశాల స్థలాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. ఈ వ్యవహారంపై గత నెల 27వ తేదీన ‘సాక్షి’ దినపత్రిక ‘పచ్చ నోట్లకు రిజిస్ట్రేషన్‌’ శీర్షికతో వార్తా కథనం ప్రచురించి వెలుగులోకి తెచ్చిన విషయం పాఠకులకు విధితమే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌, ఉన్నతాధికారులు స్పందించి విచారణ కమిటీలు వేయడం జరిగింది. అయితే విచారణల పేరిట కాలయాపన జరుగుతుందే తప్పా తమ పాఠశాల స్థలాన్ని కాపాడటంలో అధికారులకు చిత్తశుద్ధి లేదని పూర్వ విద్యార్థులు ధ్వజమెత్తారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులంతా ముక్త కంఠంతో ‘మా పాఠశాల స్థలాన్ని కాపాడండి.. ఆక్రమణలను అడ్డుకోండి.’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు తీవ్రం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం హెచ్‌ఎంకు వినతిపత్రం అందజేశారు.

స్పందించాలని డిమాండ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement