● ఏమైనా జరిగితే మీరే బాధ్యులంటూ యజమాని హల్‌చల్ ● బిత్తరపోయిన అధికారులు, సిబ్బంది
నందికొట్కూరు: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల పక్కన వెలసిన అక్రమ వెంచర్‌ను మున్సిపల్ కమిషనర్ జి.వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి రంగస్వామి జేసీబీతో మంగళవారం తొలగించారు. ల్యాండ్ ఓనర్ బద్రిశెట్టి రంగయ్యకు చెందిన సర్వే నంబరు 790లో మూడెకరాల భూమిని నహిమూన్ రహిమాన్ అగ్రిమెంట్‌తో కొనుగోలు చేశాడు. తన వెంచర్‌ను తొలగిస్తే మా నాన్నకు ఏమైనా జరిగితే మీరే బాధ్యులు, ముందే ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. అని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని, సిబ్బందిని బెదిరించాడు. అక్కడి నుంచి మున్సిపల్ కార్యాల యం చేరుకొని ఇస్టానుసారంగా బెంచీలపై పిడిగుద్దులు గుద్దుతూ అధికారులను నానా దుర్భాషలాడారు. దీంతో కార్యాలయంలో పని చేసే ఉద్యో గులు అర్థం కాక బిత్తరపోయ్యారు. అంతేగాకుండా నా వెంచర్ గురించి పత్రికల్లో రాస్తే పాత్రికేయులపై కూడా కేసులు పెడతానని బెదిరించారు.


