● కొలనుభారతి దేవి ఆలయంలో పూజల అడ్డగింత
కొత్తపల్లి: మండలంలోని ఏకై క సరస్వతీ క్షేత్రం శ్రీశైల దేవస్థానం దత్తత దేవాలయమైన కొలనుభారతి దేవి ఆలయంలో పురోహితుల మధ్య రగడ మొదలైంది. ఈ నెల 23వ తేదీన కొంత మంది వ్యక్తులు శ్రీశైలం దేవస్థానం అధికారుల అనుమతి లేకుండా కొలనుభారతి క్షేత్రంలో నవ చండీయాగం నిర్వహించారు. ఈ విషయమై శ్రీశైలం దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు ఆదేశాలతో ఏఈఓ ఫణిధర్ ప్రసాద్‌ను ప్రత్యేక అధికారిగా నియమించి విచారణ జరిపించారు. ఆలయ సిబ్బంది ఇద్దరు, పురోహితులను విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఈఓ ఆదేశాలతో పూరోహితులు అమ్మవారి క్షేత్రంలో పూజలు చేసేందుకు వచ్చారు. అయితే స్థానిక పురోహితులు శ్రీశైలం నుంచి వచ్చిన పురోహితులను అడ్డుకోవడంతో పాటు వాగ్వాదానికి దిగారు. దీంతో శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు ఆదేశాలతో మంగళవారం ఏఈఓ ఫణిధర్ ప్రసాద్ కొలనుభారతి క్షేత్రాన్ని చేరుకొని శ్రీశైలం పూజారులతో పూజలు చేయించేందుకు సహకరించాలని స్థానిక పురోహితులను కోరాగా వారు లెక్కచేయలేదు. ఈ విషయమై పురోహితులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని శ్రీశైల దేవస్థానం ఈఓకు ఫిర్యాదు చేస్తామని ఏఈఓ ఫణిధర్ ప్రసాద్ వెల్లడించారు.
యువకుడి ఆత్మహత్య
కొత్తపల్లి: క్షణికావేశంలో యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డా డు. ఘటనపై కొత్తపల్లి ఎస్‌ఐ జయశేఖర్ మంగళవారం రాత్రి తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పెద్దగుమ్మడాపురం గ్రామానికి చెంది న సంజపో గు కళ్యాణ్ (20)కు దైవభక్తి ఎక్కువ. మరికొద్ది రోజుల్లో అతని అక్క వివాహం జరిపించేందుకు కుటు ంబీకులు నిశ్చయించారు. ఈ క్రమంలో పెళ్లి పత్రికలపై తనకు ఇష్టంలేని దేవుడి బొమ్మ ముద్రించారని, ఎలాగైనా తొలగించాలని కల్యాణ్ తండ్రితో చిన్న వాగ్వాదం చేశారు. తండ్రి కురుమయ్య పత్రికలను ముద్రించాం ఇప్పుడు తీసివేయడం కుదరదని చెప్పడంతో యువకుడు మన స్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు తాడుతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయమై తండ్రి కురుమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
● ప్రయాణికులకు తప్పిన ప్రమాదం..
కోడుమూరు రూరల్: కోడుమూరు నుంచి కర్నూలుకు వెళ్లే రోడ్డులో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గుంతకల్‌కు చెందిన ఆర్టీసీ బస్సు కోడుమూరు మీదుగా కర్నూలుకు వెళుతుండగా, పెద్దపాడు సమీపాన అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బస్సులోని ప్రయాణికులు ఇతర వాహనాల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.
కర్నూలు: ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్ల విధులు, బాధ్యతలపై న్యాయ సేవా సదన్‌లో శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. కక్షిదారులకు సత్వరమే సేవలు అందించడం, అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించడం, చట్టపరమైన సమస్యలను పరిష్కరించడంలో సహకారం అందించాలని వారికి సూచించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు పాల్గొన్నారు.


