శభాష్‌ మారెప్ప | - | Sakshi
Sakshi News home page

శభాష్‌ మారెప్ప

Jul 1 2026 5:08 AM | Updated on Jul 1 2026 5:08 AM

● రెండున్నర తులాల బంగారు, నగదు అప్పగింత అదృశ్యమా.. హత్యా? తేల్చండి అంగన్‌వాడీ టీచర్‌పై వేధింపులు అమానుషం

పెద్దకడబూరు: మండల కేంద్రానికి చెందిన మారెప్ప (దివ్యాంగుడు) తన నిజాయితీ చాటుకొని శభాష్‌ అనిపించుకున్నారు. వివరాలలోకి వెళితే.. పెద్దకడబూరుకు చెందిన చాకలి మధు సోమవారం తన ద్విచక్ర వాహనంలో బట్టల బ్యాగ్‌తో పాటు పైన పర్స్‌ పెట్టుకొని వెళుతున్నాడు. మెయిన్‌ రోడ్డులో పర్స్‌ కింద పడిపోయింది. ఇంటికి వెళ్లి చూసుకోగా పర్స్‌ లేకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ దారిలో తన త్రిచక్ర వాహనంలో వెళుతున్న మారెప్పకు పర్స్‌ కనపడింది. దాన్ని తీసి చూడగా రెండున్నర తులాల బంగారు నెక్లెస్‌తో పాటు రూ.1300 నగదు ఉన్నాయి. దీనిపై మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ మారుతికి విషయం చెప్పాడు. ఎస్‌ఐ బాధితులను పిలిపించి బంగారంతో పాటు నగదును అప్పజెప్పారు. మారెప్ప నిజాయితీని మెచ్చుకొని నలుగురికి ఆదర్శంగా నిలవాలని పొగడ్తలతో ముంచెత్తారు. ఏఎస్‌ఐ ఆనంద్‌ ఉన్నారు.

1,58,375 హెక్టార్లలో

పంటల సాగు

కర్నూలు(అగ్రికల్చర్‌): జూన్‌ నెలలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదైనప్పటికీ సాగులో పురోగతి కరువైంది. దాదాపు 20 రోజులుగా వర్షాల జాడ లేకపోవడంతో ఖరీఫ్‌ ముందుకు సాగడం లేదు. ఖరీఫ్‌ సాధారణ సాగు 4,35,104 హెక్టార్లు ఉండగా.. జూన్‌ చివరిలోపు 50 శాతం వరకు సాగు పూర్తి కావాల్సి ఉంది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 1,58,375 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. జూన్‌ నెల సాధారణ వర్షపాతం 77.7 మిమీ ఉండగా 102.7 మి.మీ వర్షపాతం నమోదైంది. 32 శాతం అధిక వర్షపాతం నమోదైనప్పటికీ 20 రోజులుగా వర్షాలు కనుమరుగవడంతో సాగు మందగించినట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో పత్తి సాగు పెరుగుతోంది. ఇప్పటి వరకు 1,30,662 హెక్టార్లలో సాగయింది. నల్ల రేగడి నేలలు ఎక్కువగా ఉండటం వల్ల పత్తి సాగు పెరుగుతోంది. మిగిలిన అన్ని పంటలు 27,713 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి.

కర్నూలు: కల్లూరు ఎస్టేట్‌ మహాలక్ష్మి నగర్‌కు చెందిన కొండపల్లి శ్రీను మే 13 నుంచి కనిపించడం లేదని, అదే నెల 27న నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కొండపల్లి శ్రీను ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో డెలివ రీ బాయ్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అదే కాలనీకి చెందిన మౌలాలికి స్నేహితుడు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలసి ఉండేవారు. కొంతకాలం క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మౌలాలే కొండపల్లి శ్రీనును మద్యం సేవించేందుకు తీసుకెళ్లి హత్య చేసి శవాన్ని మాయం చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఆ చూకీ లభించకపోవడంతో మంగళవారం సా యంత్రం కుటుంబ సభ్యులు కాలనీ ప్రజలతో కలిసి నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని కొద్దిసేపు ఆందోళన చేశారు. ఫోన్‌ కాల్‌ డేటాను పరిశీలించి శ్రీను ఆచూకీ కనుగొనాలని సీఐను వే డుకున్నారు. సీఐ విక్రమసింహా స్పష్టమైన హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

కర్నూలు(అర్బన్‌): ఆలూరు మండలం పెద్ద హోతూరుకు చెందిన అంగన్‌వాడీ టీచర్‌పై టీడీపీ కార్యకర్త వేధింపులకు పాల్పడటం అమానుషం అని జిల్లా కురువ, బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక కార్యాలయం ఆవరణలో జరిగిన సమావేశంలో కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి, బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు దేవపూజ ధనుంజయ ఆచారి, వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులునాయుడు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. వేధింపుల కారణంగా బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు నిందితుడికి కఠినంగా శిక్షించాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement