జోళదరాశి
2.95టీఎంసీలు
రూ.207.95 కోటు్ల
రాజోలి
0.8 టీఎంసీలు
రూ.1,357 కోట్లు
అగ్రిమెంట్లు రద్దు
అలగనూరు రిజర్వాయర్ పనులు చేయిస్తే సరిపోతుందని, రాజోలి, జోళదరాశి రిజర్వాయర్లు నిర్మించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ పెద్దల దృష్టికి టీడీపీ నేతలు తీసుకెళ్లారు. రిజర్వాయర్ల పనులు 25 శాతంలోపే జరిగాయనే ఇటీవల సాకు చూపారు. ఈ మేరకు పనులను నిలిపివేసేందుకు ప్రభుత్వానికి ఇంజినీర్లు ప్రతిపాదనలు పంపించారు. ఈ విషయంపై జల వనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ కబీర్ బాషాను వివరణ కోరగా.. రాజోలి, జోళదరాశి రిజర్వాయర్ల పనులు 14 శాతం కూడా జరగలేదన్నారు. 25 శాతంలోపు పనులు జరిగిన వాటిని ఏజెన్సీలతో చేసుకున్న అగ్రిమెంట్లు రద్దు చేసుకునేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు జూన్ నెలలోపంపించామని చెప్పారు.
కర్నూలు సిటీ: రాయలసీమ జిల్లాలకు తుంగభద్ర జలాలు ప్రధాన వనరు. బ్రిటీష్ నాటి కాలంలో నిర్మించిన కేసీ కెనాల్ నీరే ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప జల్లాలకు జలాధారం. సుంకేసుల బ్యారేజీ నుంచి కడప జిల్లాలోని కృష్ణాపురం వరకు 305.6 కి.మీ వరకు ఈ కాలువ ప్రయాణిస్తుంది. రెండు ఉమ్మడి జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాలకు ఆయకట్టు, 260 గ్రామాలకు సాగు, తాగు నీటిని అందిస్తుంది. కేసీ కాలువకు తుంగభద్ర జలాల్లో 39.9 టీఎంసీల నీటి వాటా ఉంది. ఇందులో 29.9 టీఎంసీలు నది ప్రవాహ నీటి నుంచి, 10 టీఎంసీల నీరు టీబీ డ్యాం నిల్వ నుంచి వాడుకునేలా కేటాయింపులు ఉన్నాయి. అయితే తుందభద్ర నదికి వరద నీటి ప్రవాహం ఉన్న సమయంలో నీటిని నిల్వ చేసుకునేందుకు అలగనూరు రిజర్వాయర్(2.95 టీఎంసీలు)మాత్రమే ఉంది. ఈ రిజర్వాయర్ నీరు తాగు నీటికి కూడా సరిపోవడం లేదు. ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని చివరి ఆయకట్టుకు సాగు, తాగు నీరు అందడం లేదు. ప్రతి ఏటా ఈ ఆయకట్టుదారులు సాగు నీటి కోసం ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులు. ప్రతి ఏటా పంటలు చేతికొచ్చే దశలో నీటి కష్టాలతో రైతులు నష్టపోయేవారు. కేసీ రైతుల కన్నీటి కష్టాలు తీర్చేందుకు 2008 డిసెంబరు 23న రాజోలి, జోళదరాశి ప్రాజెక్టులు నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ.407.06 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ జీఓ ఎం.ఎస్ నంబరు 244ను జారీ చేశారు. ఆ రిజర్వాయర్ల నిర్మాణాలకు సిద్ధం అవుతున్న సమయంలో ఎన్నికల కోడ్ రావడం, ఆ తరువాత 2009లో వైఎస్సార్ హఠాన్మరణంతో పనులకు గ్రహణం పట్టుకుంది. ఆ తరువాత ఆ రిజర్వాయర్ల గురించి పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక 2015–16 ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం రూ.697 కోట్లకు అంచనాతోనే వంచించారు.
రెండేళ్లుగా నిలిచిపోయిన పనులు
కుందూనదిపై రాజోలి, జోళదరాశి రిజర్వాయర్ల కోసం 2019 డిసెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జోళదరాశి(2.95టీఎంసీలు) నిర్మాణానికి రూ.207.95 కోట్లు, రాజోలి(0.8 టీఎంసీలు)నిర్మాణానికి రూ.1,357 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ భూములు ఉన్న చోట కుందునదిని విస్తరించే పనులు సైతం చేపట్టారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణాలకు భూసేకరణ జరుగుతున్న సమయంలో అధిక రేటు చెల్లించాలని పనులకు అడ్డుపడ్డారు. రాజోలి జలాశయంలో ఆరు గ్రామాలు 9,938 ఎకరాలు, జోళదరాశికి ఒక గ్రామం 2,157 ఎకరాలు ముంపుకు గురవుతోంది. ఇందులో కొంత భూసేకరణ పూర్తయింది. ఆలోపు ఎన్నికల రావడం.. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావడంతో ఆ రిజర్వాయర్ల పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి.
మేం అధికారంలోకి వస్తే రాజోలి, జోళదరాశి ప్రాజెక్టులు నిర్మిస్తాం. భూములు కోల్పోయే రైతులకు రెట్టింపు పరిహారం చెల్లిస్తాం.
– ‘యువగళం’ పాదయాత్రలో నారా లోకేష్
రాజోలి, జోళదరాశి రిజర్వాయర్లు నిర్మిస్తాం. కడప జిల్లాలోని చివరి ఆయకట్టుకు సాగు నీరు ఇస్తాం.
– 2025 జనవరి 18న మైదుకూరులో సీఎం చంద్రబాబు నాయుడు
రాజోలి, జోళదరాశి
రిజర్వాయర్లు ఇక లేనట్లే!
రెండేళ్లుగా నిలిచిపోయిన పనులు
తాజాగా వాటిని రద్దు చేయాలని
ప్రతిపాదనలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో
రూ.1,758 కోట్ల మంజూరు
2019లో శంకుస్థాపన చేసిన
అప్పటి సీఎం వైఎస్
నేడు రిజర్వాయర్ల కింద
84,686 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకం


