రెండో జాబితాలో పేరు ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు | - | Sakshi
Sakshi News home page

రెండో జాబితాలో పేరు ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు

Jul 4 2026 2:31 AM | Updated on Jul 4 2026 2:31 AM

రెండో జాబితాలో పేరు ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు నిర్వాసితులకు న్యాయం చేయాలి

మాది వీరాపురం గ్రామం. మా కుటుంబం శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌లో 4.10 ఎకరాల భూమిని, ఇల్లును కోల్పోయాం. అప్పటి సీఎం ఎన్టీఆర్‌ ఇచ్చిన జీవోతో ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూశాను. రోజులు గడుస్తున్నా ఉద్యోగం కలగానే మిగిలింది. రెండోవ జాబితాలో నా పేరు ఉన్నా ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదు. నా వయస్సు 45 ఏళ్లు. ఇంకెప్పుడు ఉద్యోగం ఇస్తారో దిక్కుతోచడం లేదు.

– ఎస్‌. జయన్న నెహ్రునగర్‌ గ్రామం,

పగిడ్యాల మండలం

రెండెకరాల భూమితో పాటు ఇళ్లు కూడా శ్రీశైలం ప్రాజెక్టులో పోయాయి. 42 ఏళ్ల వయస్సు వచ్చినా ఉద్యోగం రాలేదు. దేశంలో ఎవరికీ జరగని అన్యాయం శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు జరిగింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం, ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. ఇలా చేయడం నాలుగో సారి. నిర్వాసితులకు న్యాయం చేసి ఉద్యోగాలు కల్పించాలి.

– కొండ దరగయ్య, జూటూరు గ్రామం, పాములపాడు మండలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement