బొమ్మలసత్రం: సుధీర్ఘకాలం పోలీస్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన సిబ్బంది శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాలని జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ అన్నారు. మంగళవారం పదవీ విరమణ పొందిన ఎస్‌ఐలు గోపాల్, నజీర్‌హుస్సేన్, హుస్సేన్‌బాషా, రంగయ్యతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు షేక్షావలి, తమ్మిరెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డిని ఎస్పీ ఆయన కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దాదాపు 40 ఏళ్ల పాటు పోలీస్‌శాఖకు సేవలందించటం అభనందనీయమన్నారు. ఇప్పటి నుంచి ఆరోగ్యంపై దృష్టి నిలిపి సంతోషంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఖాదర్‌బాషా, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, పరిపాలన విభాగం అధికారులు వీరన్న, ఖాదర్‌బాషా, పోలీస్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షులు స్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు.


