నకిలీ వైద్యుల నిరోధక కమిటీ సభ్యుడిగా శ్రీహరి | - | Sakshi
Sakshi News home page

నకిలీ వైద్యుల నిరోధక కమిటీ సభ్యుడిగా శ్రీహరి

Jul 1 2026 5:08 AM | Updated on Jul 1 2026 5:08 AM

నకిలీ వైద్యుల నిరోధక కమిటీ సభ్యుడిగా శ్రీహరి

కర్నూలు(హాస్పిటల్‌): ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ రాష్ట్ర యాంటీ క్వాకరీ (నకిలీ వైద్యుల నిరోధక) కమిటీని అధికారికంగా ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యుడిగా కోడుమూరుకు చెందిన డాక్టర్‌ శ్రీహరి కురువ నియమితులయ్యారు. ఈ నూతన సబ్‌ కమిటీ.. చైర్మన్‌ డాక్టర్‌ సుబ్బారాయుడు పర్యవేక్షణలో నేరుగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నకిలీ వైద్యానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం రావాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తు న్న వైద్యవర్గాల్లో ఈ కమిటీ ఏర్పాటు సరికొత్త ఆశలను రేకెత్తించిందని ఆయన అన్నారు. గతంలో ఇలాంటి కమిటీలు కాగితాలకే పరిమితమయ్యాయని, ఈసారి నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తామన్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో అవలంభిస్తున్న విధానాలను అధ్యయనం చేసి ఇక్కడ కూడా పక్కాగా అమలు చేస్తామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement