ప్రయాణికురాలి మెడలోని నెక్లెస్‌ చోరీ | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికురాలి మెడలోని నెక్లెస్‌ చోరీ

Jul 3 2026 1:46 AM | Updated on Jul 3 2026 1:46 AM

కర్నూలు: కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ మహిళ మెడలోని బంగారు నెక్లెస్‌ను గుర్తు తెలియని వ్యక్తి కొట్టేసి పారిపోయాడు. వివరాలు.. కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన ఈశ్వరమ్మ దంపతులు కర్నూలులో వివాహ వేడుకలో పాల్గొని తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు 6వ నంబర్‌ ప్లాట్‌ఫారం వద్ద బస్సు ఎక్కుతుండగా గుర్తు తెలియని యువకుడు బస్సు డోర్‌ వద్దకు వచ్చి ఈశ్వరమ్మ మెడలో ఉన్న ఒకటిన్నర తులం బంగారు నెక్లెస్‌ను లాక్కుని పారిపోయాడు. ఆమె అప్రమత్తమై కేకలు వేసేలోగా దొంగ కనిపించకుండా పారిపోయాడు. ఘటనపై బాధితురాలు నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కానిస్టేబుల్‌ వెంటనే స్పందించి బస్టాండ్‌లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. నెక్లెస్‌ చోరీ జరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ దొంగ ముఖం స్పష్టంగా కనిపించలేదు. దీంతో పక్కనున్న సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement