ఉచిత విద్యుత్ రైతుల పాలిట వరంగా మారింది. 2004 ముందు రైతుల పరిస్థితి దయనీయం. అప్పట్లోనే వ్యవసాయ విద్యుత్ రైతులకు పెనుభారంగా మారింది. నాటి పాలకులే వ్యవసాయం దండగని ప్రకటించడంతో రైతులకు చేయూత కరువైంది. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా రైతులకు ఊపిరి పోశారు. వైఎస్‌ఆర్ మరణించే నాటికి ఉమ్మడి జిల్లాలో 1.50 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లు ఉండగా.. 2018–19 నాటికి 1.64 లక్షల కనెక్షన్‌లకు చేరాయి. అంటే వైఎస్‌ఆర్ తర్వాత ఇచ్చిన కనెక్షన్లు 14వేలు మాత్రమే. అప్పట్లోనే వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ విజయవంతంగా అందించి రైతులకు దేవుడయ్యారు.


