12 గంటల నరకయాతన | - | Sakshi
Sakshi News home page

12 గంటల నరకయాతన

Jun 28 2026 7:12 AM | Updated on Jun 28 2026 7:12 AM

సీఎం పర్యటనతో ప్రయాణికుల అగచాట్లు

మహానంది: ఎక్కడో సీఎం పర్యటిస్తుంటే 12 గంటల పాటు వాహనాల రాకపోకలను స్తంభింపజేయడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్కాపురం జిల్లా కృష్ణంశెట్టిపల్లెలో సంజీవని లబ్ధిదారులతో సమావేశంతో పాటు అభివృద్ధి పనులకు శనివారం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలతో నంద్యాల నుంచి గాజులపల్లె మీదుగా గిద్దలూరు, గుంటూరు, విజయవాడ వెళ్లే వాహనాలతో పాటు విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపేయడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. చివరికి అంబులెన్స్‌ను సైతం పంపించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కిలోమీటర్ల మేర వాహనాలను నిలిపేయడంతో అన్నమో రామచంద్రా, దాహమో దేవా అంటూ ప్రజలు అల్లాడిపోయారు. గుంటూరు వైపు వెళ్లే వారిని మైదుకూరు మీదుగా, శ్రీశైలం వైపు వెళ్లే ప్రయాణికులను ఆత్మకూరు, దోర్నాల మీదుగా పంపించేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement