బస్సులు లేక అవస్థలు | - | Sakshi
Sakshi News home page

బస్సులు లేక అవస్థలు

Jul 1 2026 5:08 AM | Updated on Jul 1 2026 5:08 AM

హొళగుంద: మండల కేంద్రంలో బస్టాండు నుంచి సినిమా టాకీస్‌ వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు కారణంగా ముద్దటమాగి, కోగిలతోట గ్రామాలకు ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయి విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడ్తున్నారు. ఆయా గ్రామాలతో పాటు సుళువాయి, పెద్దహ్యాట, సమ్మతగేరి, ముగుమానుగుంది తదితర గ్రామాలకు కూడా ఇదే మార్గం కావడంతో బస్సుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ మార్గం కాకుండా వేరేవి ఉన్నా డ్రైవర్లు ఆ రూట్‌లో తిప్పేందుకు ఇబ్బందిగా ఉందని చెబుతూ కొన్నిసార్లు బస్సులను నడపడం లేదు. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు రోజూ హొళగుంద జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎడ్లబండ్లు, ఆటోలు, బైకులు ఏది దొరికితే వాటిపై ఎక్కి పాఠశాలకు వెళుతున్నారు. వందల సంఖ్యలో విద్యార్థులు బడికి వెళ్లేందుకు రోజూ ఇబ్బందులు పడుతున్నారని ప్రత్యామ్నయ మార్గంలో బస్సులు నడపాలని ఆయా గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement