విద్యుత్‌ వినియోగంపై ఆడిట్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ వినియోగంపై ఆడిట్‌

Jul 4 2026 2:37 AM | Updated on Jul 4 2026 2:37 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రతి జిల్లాలో ఒక ఫీడర్‌లో విద్యుత్‌ వినియోగంపై సమగ్రంగా ఆడిట్‌ చేయాలని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ఆదేశించారని విద్యుత్‌ శాఖ జిల్లా నోడల్‌ అధికారి ఆర్‌.పద్మ తెలిపారు. ఇందులో భాగంగా కర్నూలులోని బళ్లారి రోడ్డు సెక్షన్‌న్‌లోని ఎస్‌ఏపీ క్యాంపు సబ్‌స్టేషన్‌ నందు 11 కేవీ ఆటోనగర్‌ ఫీడర్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఫీడర్‌ను ఆమెతో పాటు కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్‌, టౌన్‌ ఈఈ శేషాద్రి తదితరులు పరిశీలించారు. ఫీడర్‌ పరిధిలోని అన్ని ట్రాన్స్‌ఫార్మర్లకు, సర్వీసులన్నింటికీ స్మార్ట్‌ మీటర్లు బిగించి ఆడిట్‌ చేసేందుకు వీలుగా పకడ్బందీగా మ్యాపింగ్‌ చేసేలా ఎన్నోవేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఫీడర్‌లో ఆడిట్‌ చేసిన తర్వాత జిల్లా అంతటా అమలు చేస్తామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement