ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైనది | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైనది

Jul 4 2026 2:37 AM | Updated on Jul 4 2026 2:37 AM

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి

కల్లూరు: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కల్లూరు అర్బన్‌ 41వ వార్డులో జరుగుతున్న ‘సర్‌’ వెరిఫికేషన్‌ కార్యక్రమాన్ని వార్డులోని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఓటరు తమ ఎన్యుమరేషన్‌ ఫారాలను వీలైనంత త్వరగా సంబంధిత బీఎల్‌ఓలకు అందజేసి వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలన్నారు. ఆదివారం కూడా బీఎల్‌ఓలు అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకుని తమ ఓటును పరిరక్షించుకోవాలన్నారు. మన ఓటు – మన బాధ్యత అనే భావనతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో వార్డులో ని స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement