ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

Jul 7 2026 1:19 AM | Updated on Jul 7 2026 1:19 AM

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం ●

డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో చికిత్సకు ఆరోగ్యశ్రీ ఉన్నా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా విచారణ చేసి, ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటాం. గత రెండేళ్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలకు భారీగా జరిమానా విధిస్తున్నారు. అయినా కూడా కొంత మంది రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఫిర్యాదు లు నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ భాస్కరరెడ్డి, ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్‌, కర్నూలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement