ట్రాక్టర్‌ ఢీకొని యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ ఢీకొని యువకుడి దుర్మరణం

Jul 7 2026 1:19 AM | Updated on Jul 7 2026 1:19 AM

ట్రాక్టర్‌ ఢీకొని యువకుడి దుర్మరణం

వెల్దుర్తి: మండల పరిధిలోని కసాపురం వద్ద రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెర్లకొత్తూరు గ్రామ యువకుడు చంద్రమోహన్‌ (25) మృతి చెందాడు. ఎస్‌ఐ నరేశ్‌ తెలిపిన వివరాల మే రకు.. మోహన్‌ ఫోటోగ్రాఫర్‌, పెయింటర్‌గా జీవిస్తూ ఇటీవల ఓ ప్రైవేట్‌ సోలార్‌ కంపెనీలో పనికి కుదిరాడు. సోమవారం బొమ్మిరెడ్డిపల్లె వద్ద కంపెనీలో పని ముగించుకుని స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరా డు. మార్గం మధ్యలో మలుపు వద్ద ఎదురుగా అతివేగంగా దూసుకొన్చిన గుర్తు తెలియని ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆపకుండా వెళ్లిపోయాడు. మృతుడికి తల్లి లక్ష్మీదేవి,భార్య రూత్‌, ఏడాది లోపు వయసున్న కుమారుడు ఉన్నా రు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు ప్రయత్నించగా బాధిత కుటుంబసభ్యులు నిరాకరించారు. తమకు న్యా యం జరగాలంటూ భీష్మించారు.రహదారిపై బైఠాయించారు. ఎస్‌ఐ నరేశ్‌ ఘటనాస్థలికి చేరుకొని వారికి సర్దిచెప్పారు. మృతుడి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement