వైభవంగా శ్రీశైలగిరి ప్రదక్షిణ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీశైలగిరి ప్రదక్షిణ

Mar 3 2026 7:22 AM | Updated on Mar 3 2026 7:22 AM

శ్రీశైలంటెంపుల్‌: పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి ఊరేగింపుగా గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండ పం, అంకాళమ్మగుడి, నందిమండపం, గంగా సదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, రింగ్‌రోడ్డు, ఫిల్టర్‌బెడ్‌, సిద్దరామప్పకొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి నందిమండపం, ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు.

మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించండి

నంద్యాల: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్‌ హాల్లో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించిన వాల్‌ పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఈనెల 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల్లో మహిళలు పాలుపంచుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కొల్లాబత్తుల కార్తీక్‌, డీఆర్‌ఓ రామునాయక్‌, ఐసీడీఎస్‌ పిడి లీలావతి దేవి తదితరులు పాల్గొన్నారు.

సారా రహిత జిల్లాగా మార్చాలి

నంద్యాల: సారా రహిత జిల్లాకు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి ఎస్‌. రవికుమార్‌ అన్నారు. సోమవారం జిల్లా ఎకై ్సజ్‌ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి ఆరా తీసి, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్‌ కేసులకు సంబంధించిన చార్జిషీట్లు సిద్ధం చేసి కోర్టుకు సమర్పించాలన్నారు. తర్వాత ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్ల వ్యక్తిగత పనితీరుపై సమీక్షించి, వారి పనితీరును మెరుగుపరచుకోలని సూచించారు. ఈనెల 13న జరగనున్న మెగా లోక్‌ అదాలత్‌ను దృష్టిలో ఉంచుకొని, వీలైనన్ని ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. మద్యం షాపులు, బార్లలో ఎటువంటి అక్రమాలు జరగకుండా, ప్రభుత్వ ఆదాయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉగా ది ఉత్సవాల నేపథ్యంలో శ్రీశైలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించి, వాటికి సంబంధించిన యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement