డ్రైవింగ్ శిక్షణకు బ్రేకులు!
● అటకెక్కిన ఐడీటీఆర్ నిర్మాణ పనులు
● రెండేళ్లుగా బిల్లులు చెల్లించని
చంద్రబాబు ప్రభుత్వం
● ఉపాధి కోల్పోతున్న యువత
పూర్తికాని వెహికల్ ట్రాక్
టీడీపీ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారు. ప్రతిష్టాత్మకమైన ఐడీటీఆర్ నిర్మాణం పనులు పూర్తయితే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందని అడ్డుకుంటున్నారు. ఐటీడీఆర్ అందుబాటులోకి వస్తే యువతకు ఉపాధి దొరుకుతుంది. వెంటనే పనులు పూర్తిచేయాలి.
– దుగ్గిరెడ్డి మధుసూదన్ రెడ్డి,
మాజీ సర్పంచ్, దేవరబండ గ్రామం
ఐడీటీఆర్ భవన నిర్మాణ పనులు పూర్తయితే సుశిక్షితులైన డ్రైవర్లు అందుబాటులోకి వస్తారు. తద్వారా జాతీయ రహదారులపై భారీ వాహనాల ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోతాయి. వేలాది మంది నిరుద్యోగులకు ఏటా ఉపాధి లభిస్తుంది.
– క్రాంతికుమార్, ఎంవిఐ, డోన్.
నిత్యం కరువు కాటకాలతో విలవిలలాడే ఈ ప్రాంతంలో చుక్క సాగునీరు అవకాశం లేదు. ఐడీటీఆర్ ఏర్పాటు నిరుద్యోగులకు గొప్పవరం లాంటిది. టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భవనాల అభివృద్ధి మందకొండిగా సాగుతోంది.
–చంద్రశేఖర్ రెడ్డి, కొత్తకోట
డోన్: రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(ఐడీటీఆర్) కేంద్ర భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో ఏటా వేయి మంది యువకులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సురక్షితులు, నైపుణ్యంతో కూడిన డ్రైవర్లు అవసరమని గుర్తించి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇప్పటివరకు 11వ ఐడీటీఆర్‌ల ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా పొదిలి తర్వాత నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తకోట గ్రామ సమీపంలో 44వ జాతీయ ర హదారి పక్కన రెండో ఐడీటీఆర్‌ను మంజూరు చేశారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.18.50 కోట్ల వ్యయంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సాకారంతో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఐడీటీఆర్ ఏర్పాటుకు ఎనలేని కృషిచేశారు.
నిధుల లేమితో పనులు కాస్త ఆలస్యంగా ప్రారంభమైన మాట వాస్తవమే. అయితే ఇటీవల కాలంలో ఐటీడీఆర్ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యా యి. త్వరలోనే శిక్షణకు అనువైన కేంద్రంగా ఇక్కడి ఐడీటీఆర్ విరాజిల్లుతుందనే నమ్మకం మాకు ఉంది.
– శ్రీనివాసులయ్య, ఆర్‌అండ్‌బి డీఈ
ఐడీటీఆర్ అడ్మినిస్ట్రేషన్ భవనం, భోజన, వసతి సదుపాయాల కోసం ఆధునిక హాస్టల్ భవనం పూర్తిచేయకపోవడం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. గత ప్రభుత్వం చేసిన 50 శాతం పనులు పూర్తి చేసింది. రెండేళ్లయినా పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం దురదృష్టకరం.
– శ్రీనివాసరెడ్డి, మల్యాల
బిల్లులు ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం
డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడంతో పాటు భారీ వాహనాల మరమ్మతులు చేయడంలో కూడా తర్ఫీదు ఇచ్చేందుకు ఐడీటీఆర్‌లో అన్నిరకాల అవకాశాలు ఉన్నాయి. డోన్ నియోజకవర్గ నిరుద్యోగులకు ఐడీటీఆర్ ఏర్పాటు గొప్పవరం లాంటిది. ఇక్కడి వారే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వారు కూడా డ్రైవింగ్‌లో నైపుణ్యత సాధించి భారీ వేతనాలతో ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా బిల్లులు చెల్లించని కారణంగా ఐడీటీఆర్ భవనాల నిర్మాణం నిలిచిపోయింది.
డ్రైవింగ్ శిక్షణకు బ్రేకులు!
డ్రైవింగ్ శిక్షణకు బ్రేకులు!
డ్రైవింగ్ శిక్షణకు బ్రేకులు!
డ్రైవింగ్ శిక్షణకు బ్రేకులు!
డ్రైవింగ్ శిక్షణకు బ్రేకులు!
డ్రైవింగ్ శిక్షణకు బ్రేకులు!


