వివాహిత ఆత్మహత్యాయత్నం
ఆదోని సెంట్రల్: ఆదోని పట్టణానికి చెందిన వివాహిత శిరీష మనస్తాపానికి గురై శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పట్టణంలోని అమరావతి కాలనీకి చెందిన శిరీషను బండిమెట్ట కాలనీకి చెందిన చిన్నఈరన్న ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి తిరుపతికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అయితే గత రెండు నెలలుగా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భార్య శిరీష చిన్న ఈరన్నను ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. ఈ నేపథ్యంలో చిన్నఈరన్న మూడు రోజుల క్రితం మందు తాగి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాడు. దీంతో అతని తల్లిదండ్రులు ఈరన్న, రాములమ్మలు తమ కుమారుడికి ఏమైనా జరిగితే నీదే బాధ్యత అని శిరీషను హెచ్చరించారు. దీంతో మనస్తాపానికి గురైన శిరీష పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు వెళ్లి చేతికున్న గాజులతో చేయిని కోసుకుని అపస్మారక స్థితిలో రైల్వే ట్రాక్‌పై పడింది. అక్కడున్న వారు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు స్పందించి శిరీషను ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో శిరీష కోలుకుంటోందని రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపారు. శిరీష ఇచ్చిన వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపారు. కేసును స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఫార్వర్డ్ చేస్తామన్నారు.
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని కూరగాయాల మార్కెట్‌లో శనివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌తో ఒక కుట్టుమిషన్ దుకాణం, నా లుగు కూరగాయల దుకాణాలు దగ్ధమయ్యాయి. కూ రగాయల మార్కెట్‌లో సా విత్రి,ఈరమ్మల కూరగాయల దుకాణం పక్కన ఉన్న విద్యుత్ స్తంభం నుంచి షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. అవి దుకాణాలకు వ్యాపించాయి. మార్కెట్ నుంచి వెళ్తున్న వారు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు ఆర్పేందుకు స్థానికలు ప్రయత్నించినా కాకపోవటంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే పూర్తిగా కూరగాయాల దుకాణాలు కాలిబూడిదైపోవటంతో అందులో ఉన్న సరుకులు పూర్తిగా కాలిపోయాయి. అలాగే చిన్ననర్సోజీ అనే వ్యక్తి టార్పల్ కుట్టే మిషన్, వస్తువులు కాలిపోయాయి. మార్కెట్లోని సావిత్రి, ఈరమ్మ, రంగమ్మ, సుగుణమ్మ, నర్సోజీల దుకాణాలు కలిపి మొత్తం రూ. 3 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తుంది. కూరగాయాలు అమ్ముకొని జీవనం సాగించేవాళ్లమని, ఇప్పుడు రోడ్డున పడ్డామని,ప్రభుత్వం అదుకోవాలని బాఽధి తులు కోరుతున్నారు.
ఆలూరు రూరల్: పశుగ్రాసం కోసం జొన్నచొప్పను కటింగ్ మిషన్‌లో వేస్తున్న యువకుడి కుడి చెయ్యి తెగి తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలోని మొలగవల్లి గ్రామ సమీపంలోని పొలంలో శనివారం ప్రమాదం చోటు చేసకుంది. వివరాలు..మండలంలోని కురువళ్లి గ్రామానికి చెందిన హరికృష్ణ పశుగ్రాసం కోసం జొన్న చొప్ప మిషన్ బాడుగుకు తీసుకుని పొలాల్లో జొన్న కంకలు కోసిన చొప్పను కటింగ్ చేసి సంపాదిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మొలగవల్లి గ్రామ సమీప పొలంలో జొన్నచొప్పను మిషన్‌లో వేస్తుండగా ప్రమాదశాత్తు కుడిచేయి మణికట్టు వరకు తెగిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కూలీలు బాధితుడిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పిచారు. వైద్యపరీక్షల అనంతరం మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు ఆదోని ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేశారు.
వివాహిత ఆత్మహత్యాయత్నం


