మద్దిలేటయ్యలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

మద్దిలేటయ్యలో భక్తుల రద్దీ

Feb 22 2026 8:30 AM | Updated on Feb 22 2026 8:30 AM

మద్ది

మద్దిలేటయ్యలో భక్తుల రద్దీ

బేతంచెర్ల: ఆర్‌ఎస్‌ రంగాపురం శివారులో వెలసిన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. పాల్గుణ మాసం పురస్కరించుకొని చిన్నారుల కేశఖండన స్వామి, అమ్మవార్ల దర్శనార్థం భక్తులు తరలి వచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన చేశారు. స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఉపకమిషనర్‌ రామాంజనేయులు ఏర్పాట్లు చేశారు.

పరిశుభ్రత సమష్టి బాధ్యత

నంద్యాల: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి సమష్టి బాధ్యత అని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్‌ ఆవరణలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ స్వయంగా పాల్గొన్నారు. చెత్త, వ్యర్థ పదార్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్‌, వివిధ విభాగాల అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ సమక్షంలో సిబ్బంది అందరూ ప్రతిజ్ఞ చేశారు.

జాతీయ శిక్షణకు దివ్యాంగ విద్యార్థులు

కోవెలకుంట్ల/చాగలమర్రి: జమ్మూ కాశ్మీర్‌లోని లడక్‌లో నిర్వహిస్తున్న పర్వతారోహణ జాతీయ స్థాయి శిక్షణకు దివ్యాంగ విద్యార్థులు మధు మనోజ్‌, కీర్తన ఎంపికయ్యారు. వారిని ఉపాధ్యాయులు అభినందించారు.కోవెలకుంట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మధు మనోజ్‌ రెండునెలల క్రితం రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచాడు. చాగలమర్రి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న కీర్తన రాష్ట్రస్థాయి ఎంపికలో ప్రతిభ కనబరిచారు. ఈ నెల 23 నుంచి మార్చి3 వరకు లడక్‌లో జరిగే జాతీయస్థాయి శిక్షణకు హాజరుకానున్నారు.

1న జెడ్పీ సర్వసభ్య సమావేశం

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని మార్చి 1న(ఆదివారం) ఉదయం 11 గంటల నుంచి జెడ్పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో ప్రధానంగా గ్రామీణ నీటి సరఫరా, విద్య, ప్రజా పంపిణీ వ్యవస్థ, 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జెడ్పీ/మండల పరిషత్‌ అంచనా బడ్జెట్‌పై సమీక్ష కొనసాగుతుందన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీపీ, కోఆప్షన్‌ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు.. కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, కేడీసీసీ, కేడీసీఎంఎస్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ, కుడా, కురువ, వాల్మీకి, కుర్ణి – కరికాల భక్తల, విశ్వ బ్రాహ్మణ, బొందిలి వెల్ఫేర్‌ కార్పొరేషన్ల ఛైర్మన్లకు సమావేశానికి హాజరు కావాలని సమాచారాన్ని పంపినట్లు సీఈఓ తెలిపారు.

మనోజ్‌

కీర్తన

మద్దిలేటయ్యలో భక్తుల రద్దీ 1
1/3

మద్దిలేటయ్యలో భక్తుల రద్దీ

మద్దిలేటయ్యలో భక్తుల రద్దీ 2
2/3

మద్దిలేటయ్యలో భక్తుల రద్దీ

మద్దిలేటయ్యలో భక్తుల రద్దీ 3
3/3

మద్దిలేటయ్యలో భక్తుల రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement