పొగాకు రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు | - | Sakshi
Sakshi News home page

పొగాకు రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు

Feb 25 2026 10:18 AM | Updated on Feb 25 2026 10:18 AM

పొగాకు రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు

పొగాకు రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు

ఓర్వకల్లు: పొగాకు రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఐటీసీ కంపెనీ ప్రతినిధులను కోరారు. మండల కేంద్రమైన ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన ఐటీసీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన మండల నాయకులతో కలిసి సందర్శించారు. ముందుగా రైతుల సమస్యలను తెలుసుకున్నారు. గిట్టుధర కల్పిస్తున్నారా? నాణ్యత బాగున్నప్పటికీ సీఆర్‌ పేరుతో తిరస్కరణకు గురి చేస్తున్నారా? అని తెలుసుకుంటూ.. రైతులతో కలిసి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఎక్కువ శాతం పొగాకు బేళ్లను సీఆర్‌ పేరుతో వెనక్కి పంపుతున్నారని, దీంతో రవాణా ఖర్చులు భరించలేక చాలా అవస్థలు పడుతున్నామని పలువురు రైతులు గగ్గోలు పెట్టారు. అనంతరం కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది పొగాకు నాట్లు ప్రారంభంలోనే కురిసిన అధిక వర్షాలకు పంటలు దెబ్బతినడం, రసాయన ఎరువులు, వ్యవసాయ కూలీలు ధరలు విపరీతంగా పెరిగి పోవడంతో పెట్టుబడి పెరిగి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఎన్నో నష్టాలు, కష్టాలు అధిగమించి పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే, పంట నాణ్యత సరిగా లేదని, తేమశాతం ఎక్కువగా వుందని, రీబేల్‌ కట్టమని వెనక్కి పంపడం సబబు కాద న్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ శాతం బేళ్లను సీఆర్‌ చేయకుండా కొనుగోలు చేయాలని కంపెనీ ప్రతినిధులను కోరారు.

ప్రభుత్వమే కొనుగోలు చేయాలి..

ప్రైవేటు కంపెనీల ద్వారా పొగాకు రైతులు నష్టపోతున్న తరుణంలో ప్రభుత్వమే గిట్టుబాటు ధరతో కొనుగోళ్లు చేపట్టాలని కాటసాని డిమాండ్‌ చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో యూరియా కోసం ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడలేదని, పుష్కలంగా అందుబాటులో ఉంచిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం రైతులు రోడ్డెక్కారన్నారు. కాటసాని వెంట కర్నూలు మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు జీకే వెంగన్న, ఎంపీపీ తిప్పన్న, జెడ్పీటీసీ సభ్యులు రంగనాథ్‌గౌడు, వైఎస్సార్‌సీపీ మండల నాయకులు కాశిరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, గోపా రమణారెడ్డి, నాగతిరుపాలు, గోపా రామ్మోహన్‌రెడ్డి, రామేశ్వరరెడ్డి, హరినాథ్‌రెడ్డి, పుల్లారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

అధిక బేళ్లను ఐటీసీ అధికారులు

కొనుగోలు చేయాలి

తేమ శాతం పేరుతో వెనక్కు పంపొద్దు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు

కాటసాని రాంభూపాల్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement