సాయంత్రానికి నీరసం వస్తోంది | - | Sakshi
Sakshi News home page

సాయంత్రానికి నీరసం వస్తోంది

Feb 18 2026 7:06 AM | Updated on Feb 18 2026 7:06 AM

సాయంత

సాయంత్రానికి నీరసం వస్తోంది

సాయంత్రానికి నీరసం వస్తోంది దృష్టిసారించలేక పోతున్నాం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

మా ఊరు నుంచి స్కూల్‌ కు రావాలంటే ఉదయం 7 గంటలకు బస్సు వస్తుంది. ఆ బస్సుకు రావాలంటే ఆరు గంటలకే రెడీ అయి బస్టాండ్‌కు రావాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో పక్కకు కదలకుండా సారొళ్లు కోర్చో పెట్టి చదివిస్తున్నారు. ఉదయం ఇంటి దగ్గర పొద్దున్నే ఏదీ తినబుద్ది కాదు. మధ్యాహ్నం, పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని రాత్రి ఇంటికి వెళ్లే సరికి నీరసం వస్తోంది.

– శిరివెన్నెల, మందలూరు,

జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల

మా ఊరు నుంచి స్కూల్‌కు రావాలంటే ఉదయం 6.45 గంటలకే బస్సు ఉంది. ఆ బస్సు తప్పిపోతే మరో బస్సు లేదు. దీంతో ఆరు గంటల నుంచి బస్సు కోసం రోడ్డుపై నిలబడి 8 గంటలకు అంతా స్కూల్‌కు చేరుకుని వెంటనే స్పెషల్‌ క్లాసులో కూర్చుని చదువుకుంటాం. ఒక్కోరోజు ఇంటికి చేరుకునే లోపు 7.30 – 8 గంటలు అవుతుంది. అప్పటికే నీరసించిపోయి మళ్లీ ఇంటి దగ్గర పుస్తకం తీసినా దృష్టి పెట్టలేక పోతున్నాం.

– నాగఅంజలి, చందలూరు,

జిల్లా పరిషత్‌ బాలికల హైస్కూల్‌ ఆళ్లగడ్డ

పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా మూడు పూటలా తప్పనిసరిగా కడుపు నిండా తినడంతో పాటు సాయంత్రం సమయంలో అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి. అప్పుడే మనస్సు నిమగ్నం చేసి ప్రశాంతంగా చదువుకోవచ్చు. అర్ధాకలితో చదివితే ఏమాత్రం ఫలితం ఉండదు. ఆకలిని చంపుకుని చదువుకుంటూ ఉంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

– డాక్టర్‌ ఆంజనేయులు,

చిన్నపిల్లల వైద్య నిపుణులు

సాయంత్రానికి నీరసం వస్తోంది 
1
1/2

సాయంత్రానికి నీరసం వస్తోంది

సాయంత్రానికి నీరసం వస్తోంది 
2
2/2

సాయంత్రానికి నీరసం వస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement