శాస్త్రోక్తంగా చండీశ్వరునికి త్రిశూల స్నానం
అవరోహణ చేస్తున్న దృశ్యం
● సంప్రదాయబద్ధంగా పూర్ణాహుతి
క్రతువులు
పూజల్లో పాల్గొన్న కలెక్టర్ దంపతులు, ఆలయ చైర్మన్ రమేష్‌నాయుడు, ఈఓ శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు
పుష్కరిణిలో త్రిశూలస్నానం
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నవాహ్నిక దీక్షతో ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభించిన శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవ యాగాలకు మంగళవారం పూర్ణాహుతి నిర్వహించారు. యాగశాలలో వేదపండితులు ఉత్సవ ముగింపు క్రతువులను శాస్త్రోక్తంగా చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో 10వ రోజు మంగళవారం స్వామివారి యాగశాలలో వేదపండితులు చండీశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపా రు. పూర్ణాహుతిలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సు గంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు వంటి పూజాద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతి గా సమర్పించారు. వసంతోత్సవంలో అర్చకులు, పండితులు వసంతాన్ని సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు. చండీశ్వరుడికి సరస్వి పుష్కరిణి వద్ద ఆగమశాస్త్రబద్ధంగా స్నానాదికాలు జరిపారు. చివరిగా త్రిశూలస్నానం నిర్వహించారు. సాయంత్రం ఉత్సవాల ముగింపు సూచికంగా మొదటిరోజు బ్రహ్మోత్సవ ప్రారంభ సూచికంగా ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధ్వజపటాన్ని అవరోహణ చేశారు. సదస్యం కార్యక్రమంలో వేదపండితులచే వేదస్వస్తి నిర్వహించారు. వేదస్వస్తిలో వేదపండితులు చతుర్వేద పారాయణంలో స్వామిఅమ్మవార్లను స్తుతించారు. నాగవల్లి కార్యక్రమంలో మహాశివరాత్రి రోజున కల్యాణోత్సవం జరిపించిన భ్రమరాంబాదేవికి ఆగమశాస్త్రం సంప్రదాయం మేరకు మెట్టెలు, నల్లపూసలు సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి దంపతులు, దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రధానార్చకులు వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాల చివరి రోజు బుధవారం సాయంత్రం భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి అశ్వవాహనసేవ నిర్వహిస్తారు. అనంతరం అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు.
ధ్వజపటాన్ని
శాస్త్రోక్తంగా చండీశ్వరునికి త్రిశూల స్నానం
శాస్త్రోక్తంగా చండీశ్వరునికి త్రిశూల స్నానం
శాస్త్రోక్తంగా చండీశ్వరునికి త్రిశూల స్నానం


