తెల్లశనగల ధర పతనం
దొర్నిపాడు: కాబూలి(తెల్లశనగల)రకానికి మంచి గిరాకీ ఉందని ఎర్రశనగల(జేజే11)ను తగ్గించి విస్తారంగా సాగుచేశారు. దిగుబడులు వచ్చిన వేళ మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. రెండేళ్ల క్రితం క్వింటా రూ.7వేల నుంచి రూ.9వేల వరకు పలికింది. ప్రస్తుతం క్వింటాకు రూ.5,500 ధర లభిస్తోంది. విత్తనాల సమయంలో క్వింటా రూ.9వేలు వెచ్చించి కొనుగోలు చేసిన రైతులు పండించిన పంటను కల్లాల్లో నిల్వ ఉంచుతున్నారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి సంజీవయ్య కృషి
నంద్యాల: అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య అని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ అన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఉమ్మడి రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య జయంతిని శనివారం నిర్వహించారు. దామోదరం చిత్రపటానికి డీఆర్‌ఓతో పాటు కలెక్టరేట్ ఏఓ సుభాకర్ రావు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ... కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో పుట్టిన దామోదరం సంజీవమయ్య కష్టకాలంలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారన్నారు. ముఖ్యమంత్రిగా దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు, వరదరాజస్వామి గుడి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారన్నారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, సఫాయి కర్మచార కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ మాఫియాను అరికట్టాలి
కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో పెట్రేగిపోతున్న మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్న క్లినిక్‌ల నుంచి కార్పొరేట్ హాస్పిటళ్ల వరకు..గల్లీ మందుల దుకాణాల నుంచి డయాగ్నోస్టిక్ సెంటర్ల వరకు కమిషన్ల దందా కొనసాగుతుండడంతో పేద ప్రజల నడ్డి విరుగోతోందన్నారు. నామ మాత్రపు సేవలకు కూడా రూ.వేలలో బిల్లులు వేసి మాఫియా సభ్యులు పంచుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్.మునెప్ప, లెనిన్‌బాబు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శులు మహేష్, శ్రీనివాసరావు, ఏఐవైఎప్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, నగర కార్యదర్శి బీసన్న పాల్గొన్నారు.
మహాధర్నాను
విజయవంతం చేయండి
కర్నూలు(సెంట్రల్): కూటమి ప్రభుత్వం రజకులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈనెల 20వ తేదీన తాడేపల్లిలో నిర్వహిస్తున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శిసి.గురుశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం చాకలి ఐలమ్మ కార్యాలయంలో న్యూసిటీ కార్యదర్శి సి.శేషాద్రి, అధ్యక్షుడు రాముడు, ట్రేజరర్ శ్రీనివాసులు, ఓల్డ్‌సిటీ కార్యదర్శి జయమ్మతో కలసి ఆయన మహాధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రజకులకు అట్రాసిటీ తరహాలో రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమయ్యారని చెప్పారు.
తెల్లశనగల ధర పతనం
తెల్లశనగల ధర పతనం


