సేవాభావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
శ్రీశైలం: సాధారణ భక్తులతో పాటు శివ స్వాములు తలనీలాలను సమర్పించుకోవడానికి వస్తారని, కళ్యాణకట్టలో విధి నిర్వహణలో ఉన్నవారు సేవాభావంతో వారి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. పాతాళగంగ రోడ్డు మార్గంలోని దేవస్థానం కళ్యాణకట్టను శనివారం సాయంత్రం ఆమె సందర్శించారు. గుండు చేయడానికి ఎంత రుసుం చెల్లించారు, అధికంగా ఏమైనా వసూలు చేశారా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అధిక రుసుం చెల్లించలేదని వారు తెలపడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని అదనపు సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. దేవస్థానం సూపరిండెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


