మూడు ఎకరాల్లో పైరు తొలగించాను | - | Sakshi
Sakshi News home page

మూడు ఎకరాల్లో పైరు తొలగించాను

Feb 25 2026 10:18 AM | Updated on Feb 25 2026 10:18 AM

మూడు

మూడు ఎకరాల్లో పైరు తొలగించాను

మూడు ఎకరాల్లో పైరు తొలగించాను గిట్టుబాటు ధర కల్పించాలి

ఖరీఫ్‌ సీజన్‌లో ఎకరా రూ.15 వేలు కౌలు చెల్లించి మూడు ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. రసాయన ఎరువులు, విత్తనాలు, సేద్యాలు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 10 వేలు వెచ్చించాను. గత ఏడాది అక్టోబర్‌ నెలలో తుపాన్‌ ప్రభావంతో పైరు దెబ్బతినడంతో పైరును పూర్తిగా తొలగించాను. ఆ స్థానంలో పప్పుశనగ పంట సాగు చేయాల్సి వచ్చింది. కందిసాగుతో పెట్టుబడుల రూపంలో నష్టం వాటిల్లగా రెండోసారి వేసిన పంటకు మరలా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది.

– వెంకటేశ్వరరెడ్డి, రైతు, అమడాల,

కోవెలకుంట్ల మండలం

ఈ ఏడాది కంది పంట సాగులో పెట్టుబడులు అధికంగా పెట్టాల్సి వచ్చింది. ఎకరాకు రూ. 20 వేలు చెల్లించి పది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని కంది పంట సాగు చేశాను. విత్తనాలు, రసాయన ఎరువులు, సేద్యాల రూపంలో ఎకరాకు రూ. 22 వేలు, క్రిమి సంహారక మందుల పిచికారీకి రూ. 15 వేల చొప్పున పెట్టుబడుల రూపంలో ఖర్చు చేశాను. అధిక వర్షాలు, పొగమంచు కారణంగా ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లలోపే దిగుబడులు వచ్చాయి. కందికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి.

– మనోజ్‌కుమార్‌, రైతు, కంమపల్ల,

కోవెలకుంట్ల మండలం

మూడు ఎకరాల్లో  పైరు తొలగించాను 
1
1/1

మూడు ఎకరాల్లో పైరు తొలగించాను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement