వ్యాఘ్ర వాహనంపై మహానందీశుడి విహారం
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందిలో కొలువైన శ్రీ మహానందీశ్వరస్వామి మంగళవారం వ్యాఘ్ర వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
చెస్ శాప్ లీగ్ పోటీలు ప్రారంభం
నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని స్థానిక క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి చెస్ శాప్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ముందుండాలన్నారు. చెస్ పోటీల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు శాతం క్రీడా కోటాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పోటీల్లో వంద మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి చెస్ లీగల్ కార్యదర్శి విశ్వనాథ్, రామసుబ్బారెడ్డి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు పాల్గొన్నారు.
96.3 శాతం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
గోస్పాడు/నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఆల్బెండజోల్ మాత్రలను మంగళవారం 96.3 శాతం పూర్తి చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఎయిడెడ్, జూని యర్, డిగ్రీ కళాశాల, అంగన్‌వాడీ కేంద్రాల్లో రిజిస్టర్ అయిన చిన్నారులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. జిల్లాలో 4,38,475 మందికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాల్సి ఉండగా 4,22,271 మందికి మాత్రలను అందజేశామని డీఎంఅండ్‌హెచ్‌ఓ తెలిపారు. నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలతోనే సాధ్యమని తెలిపారు. వైద్య సిబ్బంది కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేశారన్నారు. మిగిలిపోయిన వారికి ఈనెల 24న మాప్‌అప్‌డే సందర్భంగా మాత్రలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా విద్యా శాఖ అధికారి జనార్దన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, డాక్టర్ కాంతరావునాయక్, లక్ష్మీప్రసన్న, కోటిరెడ్డి, ఎంఈఓలు బ్రహ్మయ్య, శివరాంప్రసాద్, చిత్రలేఖ, గుర్రప్ప, తదితరులు పాల్గొన్నారు.
పంట పొలాల్లో మోటార్ల తీగలు చోరీ
● రూ. 5 లక్షలకు పైగా నష్టం
మహానంది: అరటి తోటల్లో గెలలు అపహరించే కేటుగాళ్లు రూటు మార్చారు. ఈ సారి పొలాల్లోని విద్యుత్ మోటార్ల వద్ద కేబుల్ తీగలను చోరీ చేయడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు. మహానంది మండలం తెలుగుగంగ పదో బ్లాక్ కింద రైతులు అరటి సాగు చేస్తున్న పంట పొలాల్లో సుమారు 70 మోటార్ల వద్ద కేబుల్ వైర్లు అపహరించారు. సుమారు రూ. ఐదు లక్షలకు పైగా విలువ చేసే తీగలను ఎత్తుకెళ్లారని బాధిత రైతులు బోడెద్దుల రమేష్, శ్రీనివాసులు తదితరులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఏర్పాటు చేసుకోవాలంటే అదనపు ఖర్చు అని, పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి నిందితుల నుంచి తీగలను రికవరీ చేయాలని కోరుతున్నారు.
వ్యాఘ్ర వాహనంపై మహానందీశుడి విహారం
వ్యాఘ్ర వాహనంపై మహానందీశుడి విహారం
వ్యాఘ్ర వాహనంపై మహానందీశుడి విహారం


