ఏపీ జేఏసీ జిల్లా కార్యవర్గం ఎన్నిక
● చైర్మన్‌గా జవహార్‌లాల్,
ప్రధాన కార్యదర్శిగా ఇస్మాయిల్
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి( ఏపీ జేఏసీ) కర్నూలు జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఏర్పాటైంది. జేఏసీ ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఉంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్త జిల్లాల వారీగా ఏపీ ఎన్‌జీజీవోస్ అసోసియేషన్‌లు ఏర్పాటు అయ్యాయి. ఇందుకు అనుగుణంగా జేఏసీలు కూడా ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ మేరకు ఆదివారం కర్నూలులోని ఎన్‌జీఓ హోమ్‌లో జిల్లా జేఏసీ నూతన కమిటీ ఏర్పాటైంది. దాదాపు 76 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలతో పాటు వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్‌గా ఏపీ ఎన్‌జీజీవోస్ జిల్లా శాఖ అధ్యక్షుడు వి.జవహార్‌లాల్ ఎన్నికయ్యారు. జేఏసీ ప్రధాన సెక్రటరీగా ఎస్.ఇస్మాయిల్ (ఏపీటీఎఫ్–1938 జిల్లా అధ్యక్షుడు), కో–చైర్మన్‌లుగా ఎంసీ కాశన్న (ఎన్‌జీజీవోస్ అసోసియేషన్), పీఎండీ ఇస్మాయిల్ (ఆర్‌టీజీ ఎన్‌ఎంయూ), సుంకన్న(ఎస్టీయూ), వెంకటేశ్వర్లు (పశుసంవర్ధకశాఖ), వైస్ చైర్మన్‌లుగా కృష్ణారెడ్డి, లింగన్న, చాంద్‌బాషా, నాగకిశోర్, మధుసూదన్‌రెడ్డి, నవీన్‌పాటిల్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సాంబశివారెడ్డి, కోశాధికారిగా భాస్కరనాయుడు ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా వివిధ సంఘాల నుంచి 10 మంది, ఈసీ మెంబర్లుగా వివిధ సంఘాల నుంచి 15 మంది ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జవహార్‌లాల్ మాట్లాడుతూ.. సంఘటితంగా పోరాటాలు చేసేందుకు జేఏసీ అవసరం ఎంతో ఉందని తెలిపారు. జేఏసీ ద్వారా అన్ని సంఘాల సమన్వయంతో ఉద్యమాలు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల హక్కులు, డిమాండ్‌లను సాధించుకుందామని పిలుపునిచ్చారు. నూతన జేఏసీ కార్యవర్గ సభ్యులను వివిధ సంఘాల నేతలు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.


